తల్లిపాల వారోత్సవాలు
టంగాపూర్ కాలనీలోని పెద్దమ్మ గుడి ప్రాంగణంలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.అచ్చంపేటలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ ఆధ్వర్యంలో cdpo దమయంతి గారు హాజరై తల్లిపాల యొక్క విశిష్టతను వివరించారు.
పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు ముఖ్యమని, ప్రొటీన్లు, పోషక విలువలతో కూడిన తల్లిపాలు శిశువు ఆరోగ్యానికి,శరీర నిర్మాణానికి తోడ్పడుతుందని ఆమె తెలియజేశారు.
పుట్టిన గంటల్లోగా తల్లి మురుపాలు శిశువుకు అందించాలని తద్వారా పిల్లలు వ్యాధుల,రోగాల బారిన పడకుండా ఎదుగుతారని ఆమె వివరించారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆమె మహిళలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సిడిపిఓ దమయంతి, కౌన్సిలర్ గడ్డం కళమ్మ, అంగన్వాడీ టీచర్లు,కార్యకర్తలు, కాలనీ మహిళలు పాల్గొన్నారు.