డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం ప్రారంభోత్సవం
అచ్చంపేట పట్టణంలో డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని కోశాధికారి ఐ.అనురాధ గారు ప్రారంభించారు.
పురోహితుడి వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించి స్వీట్లు పంపిణీ చేశారు.
గత కొంతకాలంగా అద్దె భవనాల్లో తన కార్యక్రమాలు నిర్వహించిన ట్రెజరీ శాఖ ఇక నూతన, సొంత భవనంలో తన కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఈ కార్యక్రమానికి కోశాధికారి ఐ. అనురాధ,ఎస్టివో ఎం.విజయ భాస్కర్ గౌడ్ ,డిటిఓ సూర్య శేఖర్, కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.