డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ
ఉప్పునుంతల మండలంలోని పెనిమిళ్ళ,సీబీ తండా,పూర్య తండాలలో డంపింగ్ యార్డ్,వైకుంఠ ధామంలకు భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచులు వెంకటయ్య,శ్రావ్య,ఎంపీటీసీ భాస్కర్,జడ్పీటీసీ ప్రతాప రెడ్డి,మండల తెరాస నాయకులు పాల్గొన్నారు.
కొరటికల్ గ్రామంలో సర్పంచ్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో స్మశాన వాటికకు భూమి పూజ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణయ్య,గ్రామ కార్యదర్శి లలిత,ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,టెక్నికల్ అసిస్టెంట్ జీవన్, గ్రామస్తులు పాల్గొన్నారు.