జిల్లాకేంద్రంలో జూలై 26న విశ్రాంత ఉద్యోగుల ధర్నా

అచ్చంపేట డివిజన్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఈనెల 26వతేదీ శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 11గంటలకు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు.విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన పదవ పిఆర్సి,70 సంవత్సరాలు దాటిన వారికి అదనపు పింఛన్ చెల్లించాలని,ఆరోగ్య బీమా పథకం మరియు బస్ పాస్ రాయితి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు.
కావున ఈ ధర్నా కార్యక్రమానికి విశ్రాంత ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయవలసిందిగా సంఘము అధ్యక్షుడు టి.సురేందర్రెడ్డి కోరారు.
ఈనెల 26వ తేదీన ఉదయం 9 గంటలకు గౌరవ సభ్యులందరికీ సంఘ భవనము నుండి రవాణా సౌకర్యం కలదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కె. లింగయ్య, ట్రేజరర్ పి. కూమార స్వామి, అసోసియేట్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పి. మోహన్ రెడ్డి,సంఘము సభ్యులు పాల్గొన్నారు.