ఘనంగా సదర్ పండుగ ఉత్సవాలు

0
Sadaru pandaga uchavalu achampet

Sadaru pandaga uchavalu achampet
అచ్చంపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా సదర్ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.యాదవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ ప్రాంతం నుంచి తీసుకువచ్చిన రెండు దున్నపోతులతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో యువరాజ్ దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఉత్సవాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. హైదరాబాద్ ప్రాంతం నుండి రప్పించిన కోలాటాల ప్రత్యేక బృందాలు అందరిని ఆకట్టుకోగా, డీజే హోరులో యువకుల నృత్యాలతో మైమరిచిపోయారు. అనంతరం లింగాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభకు పెద్దమ్మ గుడి ప్రాంగణం నుండి దున్నలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు.ఈ సభలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, రాష్ట్ర యాదవ సంఘం సభ్యులు,తెరాస ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

యాదవ సంఘము సభ్యులు సదరు ఉత్సవాల ప్రత్యేకతను, యాదవుల రాజకీయ,చారిత్రక, ఆర్ధిక,సామజిక విషయాలను వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *