క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సిఎ) అధ్యక్షుడుగా అజహరుద్దీన్

క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సిఎ) అధ్యక్షుడుగా ఎన్నికైన భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌తో భేటీ అయ్యారు. కెటిఆర్ తో మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్టు అజహరుద్దీన్ తెలిపారు. శుక్రవారం హెచ్ సిఎ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అజహరుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ తదితరులు విజయం సాధించారు. హెచ్ సిఎ అధ్యక్షుడిగా ఎన్నికైన అజహరుద్దీన్ ను మంత్రి కెటిఆర్ అభినందించారు. హెచ్ సిఎను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన అజహరుద్దీన్ కు సూచించారు.