కొరటికల్ గ్రామంలో అభివృద్ధి పనుల పై గ్రామసభ
ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన అభివృద్ధి పనుల పై గ్రామసభ నిర్వహించారు.
రైతులకు,ప్రజలకు,కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికా పనులు ఎంతో కీలకమైనవని ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ జీవన్ పేర్కొన్నారు.ఈ ఆర్ధిక సంవత్సరంలో గ్రామంలో చేపట్టే కార్యక్రమాల్లో పూడికతీత,డంపింగ్ యార్డు, స్మశాన వాటికలతో పాటు పలు రకాల పనులు చేపటబోతున్నామని కావున కూలీలు పెద్దఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణయ్య,గ్రామ కార్యదర్శి లలిత,ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,గ్రామ కో-ఆప్షన్ సభ్యులు వెంకట్ రెడ్డి,లక్ష్మయ్య,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.