కొనసాగుతున్న అంగన్ వాడీల దీక్షలు

అంగన్ వాడిల సమస్యల పరిష్కారానికై రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా విఢతలు విడతలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తమని జిల్లా కార్యదర్శి పార్వతమ్మ తెలియచేసారు. అంగన్ వాడిల దీక్షలో ఆమె తమ డిమాండ్లను ప్రతిపాదించిన అనంతరం ప్రసంగించారు.
అంగన్ వాడిలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని,8 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని, నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సర్వీసు నిబంధనలను అమలు చేసి అర్హులకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు.
తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.
ఈ దీక్షలో అంగన్ వాడి ఉపాధ్యాయులు, సహాయకులు లక్ష్మమ్మ,మల్లమ్మ,చిటెమ్మ,సుగుణ,తిరుమల,మేఘమాల,దీవెన,పద్మ,కవిత పాల్గొన్నారు. RTC కార్మిక సంఘాలు మద్దతు తెలిపారు.