ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అమ్రాబాద్ మండలంలో ఎలుగుబంటి దాడి చేయడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బీకే లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర రామయ్య పశువులను మేపడానికి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. తాబేలు గుండం వద్ద పశువులు మేపుతుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది.రామయ్య కేకలు వేయడంతో సమీపంలోని కాపరులు రావడంతో ఎలుగుబంటి పారిపోయింది.కానీ అప్పటికే అతనిని ఎలుగుబంటి తీవ్రంగా గాయపరచింది.స్థానిక ఆసుపత్రిలో అతనికి ప్రాథమిక వైద్యం అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.