ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ప్రభుత్వ విప్ గా నియమించడం పై హర్షం
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్ ప్రభుత్వ విప్ గా నియమించడం పై నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.గతంలో అచ్చంపేట ఎమ్మెల్యే గా ఉన్న వారికి ఇలాంటి ప్రాధాన్యం లభించలేదని కార్యకర్తలు అన్నారు.ఈ సందర్భంగా గువ్వల బాలరాజును నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,టిఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రత్యేకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
గువ్వల బాలరాజు ను ప్రభుత్వ విప్ గా నియమించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ లింగాల,మన్ననూరు, ఉప్పునుంతల మండల టిఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చి,స్వీట్లు పంచారు.