ఎటిఎం లావాదేవీలో పరిమితులు
కొన్ని రోజుల క్రితం ఏటీఎంలో డెబిట్ కార్డు ఉపయోగించి 45 వేల వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉండేది. ప్రస్తుతం 20 వేల రూపాయలు మూడు దఫాలుగా ఏటీఎంలో విత్ డ్రా చేసే అవకాశం ఉంది, కానీ ఇక మీదట ఆ అవకాశం ఉండబోదు.
రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే ఏటీఎం ఉపయోగించి డబ్బులు విత్ డ్రా చేసుకునే విధంగా బ్యాంకు అధికారులు పావులు కదుపుతున్నారు.ఏటీఎంలలో జరుగుతున్న మోసాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు.అర్ధరాత్రి, ఉదయం పూట ఏటీఎంలో జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ లావాదేవులో పరిమితులు విధించాలనుకుంటునట్లు ఓబీసీ ఎండీ, సీఈఓ ముకేష్ కుమార్ జైన్ తెలిపారు.
ఈ ప్రతిపాదనపై గతవారం 18 బ్యాంకుల ఉన్నతాధికారులతో చర్యలు జరిపినట్లు,ఈ నూతన ఆలోచన త్వరలో కార్యరూపందాల్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.