ఉత్తమ సేవలే గుర్తింపునిస్తాయి
ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణమని,ఉద్యోగ సమయంలో చేసిన మంచి పనులు కీర్తిని ఇస్తాయని ఉమ్మడి జిల్లాల దేవాలయాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జనుంపల్లి జైపాల్ రెడ్డి అన్నారు.పదర మండలం మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ గౌడ్ పదోన్నతి పై హైదరాబాద్ కు బదిలీ కాగా హైదరాబాద్ నుంచి బదిలీపై వచ్చిన రామశర్మ ఆలయ కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా బదిలీపై వెళుతున్న సత్యనారాయణ గౌడ్, పదవి బాధ్యతలు స్వీకరించిన రామశర్మకు ఆలయ అధికారులు, అర్చకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.