ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కవిత
ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ ప్రకటించిన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు (శ్రేష్ట్ సంసద్)ను టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత గురువారం ఢిల్లీలో అందుకున్నారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవా దృక్పథం, లోక్‌సభకు హాజరు, చర్చల్లో చురు గ్గా పాల్గొనడం, ప్రశ్నలడగడం, పార్లమెంటు నియమ నిబంధనలను పాటించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న సదరు సంస్థ కవితకు అవార్డు ప్రకటించింది. తెలం గాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కవిత క్రీయాశీలకంగా పనిచేస్తున్నారని సంస్థ కొనియాడింది. ఢిల్లీలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా కవితతో పాటు మరో 25 మంది ఎంపీలు అవార్డులు అందుకున్నారు.