ఈ-ఆటో రిక్షాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
ప్రభుత్వం అందిస్తున్న ఈ-ఆటోరిక్షాలకు జిల్లా పరిధిలోని అర్హులైన బీసీలు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా బీసీల అభివృద్ధి శాఖ అధికారి రాజన్న ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండో విడత ఈ-ఆటో రిక్షాలను అందిస్తుందని,ఆటోల మంజూరు కోసం జూలై 25 నుంచి ఆగస్టు 15 లోపు www.brtop.telangana.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అర్హుడైన ప్రతి బిసి యువకుడు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
అర్హతలు:
*వయస్సు 21 ఏళ్ల నుంచి 40 లోపు ఉండాలి.
*డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, మంజూరైన తేదీ.
*మీసేవ నుంచి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం.
*గ్రామీణ ప్రాంతాల వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి.