తెలంగాణ రాష్టం లో ఆషాడా భోనాల పండుగ ప్రారంభం
ఆషాడా భోనాల పండుగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోనం అంటే భోజనం అని అర్ధం దీన్ని కొత్త కుండలో కట్టెలపొయ్యి మీద వండి అందరు మహిళలు సమూహంగా ఊరేగింపుగా గ వెళ్లి గ్రామా దేవతకు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు. బోనం కుండపైన చిన్న దివ్వె పెట్టి జ్యోతిని వెలిగించి ఊరేగింపుగా వెళతారు .
మేకపోతు మేడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు నీళ్లు చల్లుకుంటూ దేవస్థానానికి వెళ్లి దేవతకి బోనం సమర్పిస్తారు. ఇలా చేయడం ద్వారా గ్రామానికి మంచి జరుగుతుందని మరియు కష్టనష్టాలనుండి ఆ గ్రామదేవత కాపాడుతుందని ప్రజల విశ్వాసం.
ఇప్పుడు ఈ బోనాల పండుగ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా నిర్ణయించారు.