అమెరికా పోలీసుల వలలో భారత విద్యార్థులు
వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉంటున్న వారికోసం అమెరికా అధికారులు పన్నిన వలలో దాదాపు 600 మంది విదేశీ విద్యార్థులు చిక్కుకున్నారు. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సృష్టించిన ఫేక్ వర్సిటీ వలలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది భారతీయులే కాగా.. అందులో సగం తెలుగువారేనని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. న్యూజెర్సీలో 2015లో మూతపడ్డ ఫార్మింగ్‌టన్ వర్సిటీ పేరిట డీహెచ్‌ఎస్ కోర్సులు ఆఫర్ చేసింది. విద్యార్థులను చేర్పించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థి వీసా గడువు ముగిసిన, ముగిసే దశలో ఉన్న దాదాపు 600 మంది విద్యార్థులు డీహెచ్‌ఎస్ వలలో పడ్డారు. ప్రోత్సాహకాలు ఆశించి పట్టుబడ్డ జాబితాలో ఎనిమిది మంది తెలుగు యువకులు ఉండటంతో వీరిని ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు.