అచ్చంపేట లో e-చల్లాన్ వ్యవస్థ ప్రారంభం

◆e-చల్లాన్ వ్యవస్థ ప్రారంభం◆
మహా నగరాలకే పరిమితమైన ట్రాఫిక్ e-చల్లాన్ వ్యవస్థ ఇక పట్టణాలకు సైతం వర్తింప జేస్తున్నారు. అచ్చంపేట పట్టణంలో ట్రాఫిక్ e-చల్లాన్ వ్యవస్థ ప్రారంభించిన పోలీస్ శాఖ అధికారులు, దానిపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర కూడళ్లలో బ్యానర్లు ఏర్పాటు చేశారు.
ఇకపై చల్లాన వ్రాసి,అపరాధ రుసుము స్వీకరించే పద్దతి ఉండబోదు.నిబంధనలు అతిక్రమించిన వాహన చోదకులపై వారు నడిపే బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ఫైన్ విధించనున్నారు.
హెల్మెట్ లేని వాహన చోదకులకు 100రూపాయలు, ట్రిపుల్ డ్రైవింగ్ కు రూ.1200, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ కు రూ.1000,లైసెన్స్ లేని డ్రైవింగ్ కు రూ.500, డ్రంక్ అండ్ డ్రైవ్ కు జరిమానా తో పాటు జైలు శిక్ష విధించనున్నారు.