నామినేషన్లు దాఖలు చేసేందుకు MLA తో కలిసి వస్తున్నా అభ్యర్థులు.

0
Achampeta News

అచ్చంపేట : జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి మూడో విడత నామినేషన్ ల పర్వం గురువారం తో ముగిసింది. అచ్చంపేట నియోజక వర్గం పరిధిలోని అచ్చంపేట, బాలూమూర్ , అమ్రాబాద్, ఉప్పునుంతల, పదరా, వంగూరు, చరగొండ 8 జెడ్పిటిసి, 69 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 14 న ఎన్నికలు నిర్వహించ నున్నారు.

నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ ౩౦ న ప్రారంభం కాగా తోలి రోజు ఎంపీటిసికి 9 జెడ్పిటిసి కి 5 రెండవ రోజు ఎంపీటిసికి 81 , జెడ్పిటిసి కి 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి కాగా చివరి రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు భారీగా క్యూలో నించున్నారు. మూడు రోజులకు కలిసి 8 జెడ్పిటిసిలకు 88 , 69 ఎంపీటీసీలకు 421 నామినేషన్లు దాఖలయ్యాయి

ఈ నెల 3 న నామినేషన్ ల పరిశీలన కొనసాగుతుంది, 5 న ఉపసంహరణ మరియు బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన గుర్తుల కేటాయింపు ఉంటుంది, మే 14 న పోలింగ్ నిర్వహించి ఓట్లు లెక్కిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *