అంబేద్కర్ కూడలిలో రోడ్డు గుంతల మయం
అచ్చంపేటలో శనివారం ఉదయం వర్షం పడడంతో అంబేద్కర్ కూడలిలోని లింగాల్ రోడ్డుపై వర్షపు నీరు చేరింది.అంబేద్కర్ చౌరస్తా నుండి ఆంధ్ర బ్యాంకు వరకు రోడ్డు పై గుంటలు గుంటలు ఉండడంతో వర్షానికి గుంతలలో నీరు చేరింది,దానితో రోడ్డు మొత్తం బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.కనీసం మట్టి తో నైనా గుంతలను నింపితే రోడ్డుపై వర్షపు నీరు నిలవడానికి ఆస్కారం ఉండదని స్థానికులు కోరుతున్నారు.