ఉప్పునుంతల / అచ్చంపేట, నవంబర్ 19: నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని పీఎం శ్రీ (PM Shri) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ హస్తకళల డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం — CDAP (క్రాఫ్ట్ డిమానిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాం) బుధవారం విజయవంతంగా ముగిసింది.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ హస్తకళల డెవలప్‌మెంట్ అధికారి శ్రీ గౌతమ్ దత్త మాట్లాడుతూ.. ప్రకృతి ఆధారంగా లభించే వనరులతో విలువైన వస్తువులను తయారు చేయవచ్చని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చదువుతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ ఎంతో అవసరమని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ కేవలం డిగ్రీలతో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పరిమితంగా ఉంటాయని చెప్పారు. గ్రామీణ యువత, విద్యార్థులు హస్తకళలపై అభిరుచి పెంచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. మారుమూల ఉప్పునుంతలలో ఈ శిక్షణను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన మాతృభూమి రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మూడు రోజుల శిక్షణ & పోటీల విజేతలు: మాతృభూమి సంస్థ అధ్యక్షులు రమాకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు నీలా శ్రీధర్ మాట్లాడుతూ.. భారతదేశ హస్తకళలకు విశిష్ట గుర్తింపు ఉందని, ఖరీదైన హస్తకళలను ఉచితంగా విద్యార్థులకు పరిచయం చేసిన హస్తకళల విభాగం మరియు మాతృభూమి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
నవంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో 80 మంది విద్యార్థులు పాల్గొని పెయింటింగ్, బంజారా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టై & డై, బ్యాంగిల్స్ డిజైన్ అంశాల్లో నైపుణ్యాలు నేర్చుకున్నారు. రెండో రోజు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు:
పోటీ విభాగంమొదటి స్థానంరెండవ స్థానంమూడవ స్థానంవ్యాసరచన పోటీభార్గవిపూజహాజీరడ్రాయింగ్ పోటీవాణిభవానిశివ
గ్రామీణ విద్యార్థుల అభివృద్ధికి మాతృభూమి సంస్థ ద్వారా ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని సంస్థ అధ్యక్షులు రమాకాంత్ పేర్కొన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాతృభూమి ఫౌండర్ ప్యారసాని మంజుల, ట్రైనర్లు మూడవత్ వందన, సాలురాయి కవిత, కాట్రావత్ అనిత, తంగళ్ళపల్లి స్వప్న, పాఠశాల ఉపాధ్యాయులు పోకల సతీష్, శ్యాంసుందర్ గౌడ్, అజ్మతుల్లా, జి. శ్రీనివాస్, చంద్రశేఖర్, మల్లారెడ్డి, లక్ష్మణ్, శ్యామల, గౌరి, కవిత, శ్రీలత, జ్యోతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com