భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Achampet 176 Views
bhu-bharati-land-partition-issues-agency-area-achampet

ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పట్టా కష్టాలు.. భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరిన డా. నారమోని నరేష్ యాదవ్

అచ్చంపేట, నవంబర్ 24: ఏజెన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భూముల పట్టా మార్పిడి, పార్టిషన్ జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అచ్చంపేట అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీన నల్లమల ప్రాంతానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై స్పందించి, అచ్చంపేట నుండి వెళ్ళగానే క్యాబినెట్ సమావేశపరిచి చట్టపరమైన వెసులుబాటు కల్పించాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

భూభారతి వల్ల తీవ్రమవుతున్న సమస్యలు: డాక్టర్ నరేష్ యాదవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో కనీసం భూముల పార్టిషన్‌కైనా అవకాశం ఉండేదని, కానీ ప్రస్తుత 'భూభారతి' వ్యవస్థలో పార్టిషన్ అవకాశాన్ని కూడా ఎత్తివేశారని అన్నారు. తండ్రికి నలుగురు కుమారులు ఉంటే తలా పది గుంటల చొప్పున భూమి పట్టా చేద్దామంటే తండ్రి మరణిస్తే తప్ప పట్టా అయ్యే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రజావాణిలో, ఆర్డీవోలు, కలెక్టర్లకు ఎన్ని వినతులు ఇచ్చినా స్పందన లేదని వాపోయారు.

ఏజెన్సీలో ఇతర వర్గాలకు న్యాయం చేయాలి: ఏజెన్సీ ప్రాంతాలలో పేరుకు మాత్రమే ఏజెన్సీ అని, అక్కడ కేవలం ఎస్టీలకే నిబంధనలు వర్తిస్తున్నాయని, ఏజెన్సీలో నివసిస్తూ భూములను సేద్యం చేసుకుంటున్న ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పట్టాలు జరగడం లేదని తెలిపారు. బిడ్డ పెళ్లికి ఎకరం భూమి ఇద్దామన్నా, మార్టిగేజ్ చేద్దామన్నా వీలుకావడం లేదని, బ్యాంకుల్లో కనీసం LT లోన్ కూడా ఇవ్వడం లేదని, ఏజెన్సీ భూములను ఎవరూ కుదువ పెట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మారుతున్నా ప్రజల కష్టాలు తీరడం లేదని, ప్రభుత్వం పునరాలోచన చేసి చట్టంలో సవరణలు, వెసులుబాటు కల్పించి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బల్మూరు మండల అధ్యక్షుడు అమరేందర్ గౌడ్, అచ్చంపేట పట్టణ అధ్యక్షుడు నిరంజన్, జనరల్ సెక్రటరీ రమేష్, వైస్ ప్రెసిడెంట్ మహేష్, సెక్రటరీలు మల్లేష్, నాని, జానీ, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Tags: Bhu Bharati land partition, Bhu Bharati portal issues, Agency area land problems, Achampet land mutation, SC BC minority land pattas, Dr Naramoni Naresh Yadav, CM Revanth Reddy, land partition Telangana, Bhu Bharati land records, agency area land rights, Achampet TRP news, Nallamala land issues, Nagarkurnool latest news, #BhuBharati #BhuBharatiPortal #LandPartition #AgencyArea #Achampet #NaramoniNareshYadav #RevanthReddy #LandRights #SC #BC #Minorities #TRP #Nallamala #NagarkurnoolNews
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views
రేపు అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం.. 9959226291 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలà°
Health

రేపు అచ్చంపేట ఆర్టీసీ డిపోలో ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం.. 9959226291 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు తెలà°

23, Nov 2026 Views
చలో అచ్చంపేట.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి..
Health

చలో అచ్చంపేట.. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి..

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com