అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Achampet 176 Views
achampet-telangana-rajyadhikara-party-naresh-yadav-demands-tree-clearance-srisailam-road

పేదల డబ్బాలు తొలగించే అధికారులకు.. ప్రమాదకరంగా పెరిగిన రోడ్డు పక్క చెట్లు కనిపించవా?— రంగాపురం రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లను జేసీబీలతో తొలగించాలి— తెలంగాణ రాజ్యాధికార పార్టీ అచ్చంపేట ఇన్‌ఛార్జ్ డా. నారమోని నరేష్ యాదవ్ డిమాండ్

అచ్చంపేట, నవంబర్ 25: శ్రీశైలం - అచ్చంపేట ప్రధాన రహదారిపై రంగాపురం శివారు నుండి రంగాపురం గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు, పొదలు విపరీతంగా పెరిగిపోయి వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అచ్చంపేట అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ డా. నారమోని నరేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఏదైనా వాహనం వస్తే కనీసం సైడ్ దిగడానికి కూడా అవకాశం లేకుండా రోడ్డు కుంచించుకుపోయిందని, దీనివల్ల నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బుధవారం అచ్చంపేటలో ఆయన మాట్లాడుతూ.. ఇదే రహదారి వెంబడి నిత్యం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తున్నా ఈ దుస్థితి వారి కంటికి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాపాలన అంటున్న అధికారులకు, నాయకులకు రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే పేద ప్రజల డబ్బాలు మాత్రమే కనిపిస్తున్నాయని, కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా వాటిని తొలగిస్తూ పేదల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు.

పేదల ఉపాధిపై చూపిస్తున్న అత్యుత్సాహం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన రహదారి పక్క చెట్ల తొలగింపుపై ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి పర్యటనకు వస్తున్న నేపథ్యంలోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే జేసీబీలతో ఆ చెట్లను తొలగించి, వాహనదారులను ప్రమాదాల బారి నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బల్మూరు మండల అధ్యక్షుడు అమరేందర్ గౌడ్, టౌన్ ప్రెసిడెంట్ నిరంజన్, జనరల్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Rangapuram road safety, Srisailam Achampet main road, roadside trees removal, Rangapuram roadside bushes, Naramoni Naresh Yadav, TRP Achampet, Telangana Rajyadhikara Party, Achampet road conditions, road accident risk, JCB tree clearance, motorist safety, Balmoor mandal news, Nagarkurnool district news, Achampet latest news, #Rangapuram #Achampet #SrisailamAchampetRoad #NareshYadav #TRP #RoadSafety #Nagarkurnool #TelanganaNews #AchampetNews
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని
Health

అచ్చంపేట - శ్రీశైలం రోడ్డుపై చెట్ల తొలగింపునకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ | డా. నారమోని

25, Nov 2026 Views
అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం
Health

అచ్చంపేటలో సీఎం పర్యటన ఎఫెక్ట్: చిరు వ్యాపారుల తొలగింపుపై BC, SC, ST-JAC ఆగ్రహం

24, Nov 2026 Views
అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట
Health

అచ్చంపేటలో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక సందడి.. 108 కలశాలతో ఆంజనేయ స్వాముల భారీ ర్యాలీ, ఆలయాలకు పోట

24, Nov 2026 Views
భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ
Health

భూభారతిలో పార్టిషన్ అవకాశం కల్పించాలి.. ఏజెన్సీ ప్రాంత ఎస్సీ, బీసీ, మైనార్టీల పట్టా సమస్యలపై సీ

23, Nov 2026 Views
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà
Health

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్.. మెరుగైన వైద్య సేవలే లక్ష్యమన్న డాక్టà

23, Nov 2026 Views
మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ
Health

మద్దిమడుగుకు సీఎం రేవంత్ రెడ్డి రాక.. సంత్ సేవాలాల్ మహారాజ్ భూమిపూజ

23, Nov 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com