హైదరాబాద్, నవంబర్ 15:
బీసీల రాజకీయ, సామాజిక, రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం తాను నిర్వహిస్తున్న 'బీసీ రాజ్యాధికార పాదయాత్ర'లో అత్యంత తీవ్రమైన, ఆందోళనకరమైన ప్రమాదం చోటుచేసుకుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. ఇది సాధారణ ప్రమాదం కాదని, తన హత్యకు ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్రగా అనుమానిస్తున్నట్లు పేర్కొంటూ ఆయన తెలంగాణ డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
వలిగొండ నుంచి తొర్రూరు హైవే వైపు పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం అన్నాజీపురం–తిరుమలగిరి రోడ్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా, అత్యంత వేగంగా దూసుకొచ్చిన TG30T7596 రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీ, తన వాహనమైన TG30L4444 టయోటా ఫార్చునర్ కారును మరియు మరో తెలుపు రంగు టాటా ఆల్ట్రోజ్ కారును బలంగా ఢీకొట్టిందని మల్లన్న వివరించారు. ఈ ప్రమాదంలో తన సిబ్బందితో పాటు మరో వాహనంలో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
హత్యాయత్నం కోణంలో క్రిమినల్ కేసు: వెనుకబడిన తరగతుల రాజకీయ సాధికారత కోసం తాను చేస్తున్న పోరాటాన్ని అడ్డుకోవడానికి, తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రమాదాన్ని సృష్టించారని మల్లన్న బలంగా అనుమానిస్తున్నారు. తక్షణమే తగిన సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి, డీఎస్పీ (DSP) స్థాయికి తగ్గని సీనియర్ అధికారితో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరారు.
లారీ యజమాని, డ్రైవర్ మూలాలపై ఆరా: ప్రమాదానికి కారణమైన లారీ యాజమాన్యం, రిజిస్ట్రేషన్ వివరాలు, డ్రైవర్ నేపథ్యం, గత ప్రయాణ వివరాలను సేకరించాలని కోరారు. తనను లక్ష్యంగా చేసుకోవడానికి ఎవరైనా లారీని, డ్రైవర్ను ఉపయోగించారా అనే విషయాన్ని నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
సీసీటీవీ, ఎలక్ట్రానిక్ ఆధారాల భద్రత: ప్రమాద స్థలంలోని సీసీటీవీ ఫుటేజీ, హైవే నిఘా కెమెరాల రికార్డులు, సమీప భవనాల కెమెరాలు, కాల్ రికార్డింగ్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలు నాశనం కాకుండా తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరారు.
రాజకీయ కుట్ర & నిఘాపై విచారణ: ఈ ఘటన వెనుక రాజకీయ శత్రుత్వం, ముందస్తు నిఘా లేదా పాదయాత్రను అడ్డుకునే కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పోలీసుల నిష్పక్షపాత పనితీరుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఉద్యమాన్ని అడ్డుకునే శక్తులను చట్టం ముందు నిలబెట్టాలని మల్లన్న విజ్ఞప్తి చేశారు. డీజీపీని కలిసిన వారిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ తదితరులు ఉన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com