ఉప్పునుంతలలో అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
ఉప్పునుంతల, నవంబర్ 15: నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని కొత్త యశోద ఫంక్షన్ హాల్లో మండల కమిటీ ఆధ్వర్యంలో చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులకు కొత్త పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్తగా వితంతు, ఒంటరి మహిళ, వికలాంగుల పెన్షన్ల ప్రక్రియ చేపట్టలేదని విమర్శించారు. అర్హులైన పేద ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఈ చేయూత పథకానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలలో ఇప్పటికే ఐదు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన హామీలను కూడా త్వరలోనే క్షేత్రస్థాయికి తీసుకువస్తామని తెలిపారు.
మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాబోయే నవంబర్ 19న ఇందిరాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, అలాగే భూమి లేని, ఉన్న పేద కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు భీమా సదుపాయం కల్పించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని, పదేళ్లలో జరగని విధంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com