అడవిలో ఎలుగుబంటి ఘోర దాడి: చెంచు మహిళకు తీవ్ర గాయాలు!

24, May 2026 Balmoor 176 Views
Wild Bear Attacks Chenchu Woman in Balmoor Forest; Hospitalized in Achampet

అడవిలో ఎలుగుబంటి ఘోర దాడి: చెంచు మహిళకు తీవ్ర గాయాలు!

​మేకల కాపలాకు వెళ్లిన సమయంలో ప్రమాదం

​సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించిన అటవీశాఖ అధికారులు

​సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌డీఓ చంద్రశేఖర్ ఆదేశం

​బల్మూర్, మే 24

బల్మూర్ మండల పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమల అటవీ ప్రాంతంలో మేకల కాపలాకు వెళ్లిన ఒక చెంచు మహిళపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

​స్థానికులు మరియు అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంచుగూడెం గ్రామానికి చెందిన నిమ్మల సాలమ్మ (భర్త నిమ్మల రాములు) రోజువారీలాగే ఆదివారం మధ్యాహ్నం కొండనాగుల ఈస్ట్ బీట్ పరిధిలోని ‘పవన కుంట’ అటవీ ప్రాంతానికి మేకల కాపలా కోసం వెళ్లారు. అదే సమయంలో తన పిల్లలతో కలిసి సంచరిస్తున్న ఒక ఎలుగుబంటి ఒక్కసారిగా సాలమ్మపై విరుచుకుపడింది. ఈ అకస్మాత్తు దాడిలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

​సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లేశం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రాజు, మీనాక్షిలు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను దట్టమైన అడవి నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, చికిత్స నిమిత్తం అచ్చంపేటలోని మహదేవ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందుతోందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. బాధితురాలికి తక్షణ ఉపశమనం కింద అటవీశాఖ తరఫున రూ. 5,000/-ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ ఘటనపై అచ్చంపేట ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO) చంద్ర శేఖర్ స్పందిస్తూ అడవి సరిహద్దు గ్రామాల ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

​ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు, పులులు, చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. కాబట్టి అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు అడవిలోకి వెళ్లకూడదు. ముఖ్యంగా పశువులు, మేకల పెంపకందారులు, కట్టెల సేకరణకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకుండా సమూహాలుగా వెళ్లాలి. వన్యప్రాణులు కనిపిస్తే తక్షణమే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి.

ఈ ప్రమాదంతో చెంచుగూడెం మరియు పరిసర గ్రామాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు నిరంతరం నిఘా ఉంచి వన్యప్రాణుల నుంచి గ్రామస్థులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

సాయినగర్‌లో ₹76,000లకు గణేష్ లడ్డూ దక్కించుకున్న మంత్రాల లాలూ యాదవ్ | అచ్చంపేట
Health

సాయినగర్‌లో ₹76,000లకు గణేష్ లడ్డూ దక్కించుకున్న మంత్రాల లాలూ యాదవ్ | అచ్చంపేట

19, Sep 2026 Views
పాతాళగంగలో వినాయక నిమజ్జనం | భక్తులకు బిజెపి నాయకుడు సురేష్ విజ్ఞప్తి
Health

పాతాళగంగలో వినాయక నిమజ్జనం | భక్తులకు బిజెపి నాయకుడు సురేష్ విజ్ఞప్తి

19, Sep 2026 Views
ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 202613 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 20269 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 202612 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20267 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com