అచ్చంపేట, నవంబర్ 15: నల్లగొండలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా కిసాన్ సభ 36వ మహాసభలను అత్యంత విజయవంతం చేయాలని అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు, రైతులకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యనాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం నుండి అచ్చంపేట, బల్మూరు, లింగాల, ఉప్పునుంతల మండలాలకు చెందిన రైతులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నల్లగొండకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యనాయక్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు ఈ 36వ మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని తెలిపారు. రైతుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ మహాసభలకు తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్, ఐద్వా (మహిళా సంఘం) జిల్లా అధ్యక్షురాలు నిర్మల, కేవీపీఎస్ జిల్లా నాయకులు గుండె మల్లేష్, ఆర్టీసీ నాయకులు పర్వతాలు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు రైతు సంఘం నాయకులు ఆంజనేయులు, గోపాల్, సుందరయ్య, అంతయ్య, వెంకటయ్య, భీమయ్య, రజిత, వెంకటమ్మ, కల్పన, లక్ష్మి తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నల్లగొండకు బయలుదేరారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com