అచ్చంపేట:
నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండ పట్టణంలో నిర్వహించనున్న 36వ ఆల్ ఇండియా కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం జీపు జాతాను ప్రారంభించారు. ఈ ప్రచార జాతాను రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్. దేశ్యనాయక్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా దేశ్యనాయక్ మాట్లాడుతూ... నాలుగు రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ మహాసభలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రైతు సంఘం ప్రతినిధులు, జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 15న రైతన్నలంతా 'చలో నల్లగొండ' కార్యక్రమానికి కదలివచ్చి 36వ ఆల్ ఇండియా కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ (CITU) జిల్లా అధ్యక్షులు పర్వతాలు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధం సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లేష్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్ నాయక్, ఐద్వా (AIDWA) మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మల, ఆర్టీసీ కార్మికులు ఎస్. వెంకటయ్య, పర్వతాలు, రాములు, వెంకటయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com