పదర మండలంలో జనాభా గణన 2026 సర్వే పరిశీలన | రాష్ట్ర అధికారుల సమీక్ష

13, May 2026 Achampet 176 Views
census-2026-survey-inspection-padara-mandal-vankashwaram

పదర మండలంలో జనాభా గణన పనుల పరిశీలన: రాష్ట్ర గణాంక అధికారుల సమీక్ష

పదర, మే 13, 2026: 2026 సంవత్సర జనాభా గణన కార్యక్రమంలో భాగంగా పదర మండలంలోని వంకశ్వరం గ్రామంలో జరుగుతున్న హౌస్ హోల్డ్ (కుటుంబ) సర్వే విధానాన్ని రాష్ట్ర గణాంక కార్యాలయ అధికారులు బుధవారం పరిశీలించారు. హైదరాబాద్ నుండి వచ్చిన సెన్సస్ కన్సల్టెంట్ శ్రీ దయానందం, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ అర్ధనారి స్వామి, ఎస్‌ఓ శ్రీ నరసింహస్వామి ఈ పర్యటనలో పాల్గొన్నారు.

అనంతరం మండల తాసిల్దార్ శ్రీ కె. సురేష్ బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎండీ వసీమ్ అక్రమ్‌లతో కలిసి అధికారులు సెన్సస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జనాభా గణనను ఎటువంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా సర్వే పనులను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేటర్లకు పలు సూచనలు మరియు మార్గదర్శకాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సెన్సస్ సూపర్వైజర్ ఎండీ బురాన్, ఎగ్జిక్యూటివ్ రిషిత్ రెడ్డి, టెక్నీకల్ అసిస్టెంట్ నరేందర్, వంకశ్వరం గ్రామ సర్పంచ్ శ్రీమతి మౌనిక, ఉప సర్పంచ్ జయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

TAGS: Padara Mandal, Population Census 2026, Vankaswaram Village, House Hold Survey, Census Review Meeting, Telangana Census, State Statistical Officials, Padara News, Census Inspection Telangana, Household Data Collection, Hyderabad Census Officials, Tahsildar K Suresh Babu, Revenue Inspector Wasim Akram, Telangana Government Survey, Census Staff Review, Local Administration News, Telangana Latest News, Village Survey Program

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com