జర్నలిస్టుల బస్ పాస్ సమస్యపై మంత్రి పొంగులేటితో మాట్లాడిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

21, May 2026 Amrabad 176 Views
Nallamala Press Club journalists submitting a representation to Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna regarding bus passes.

జర్నలిస్టుల బస్ పాస్ సమస్యపై స్పందించిన అచ్చంపేట ఎమ్మెల్యే.. మంత్రి పొంగులేటితో ఫోన్లో సంభాషణ!

అచ్చంపేట, మే 21: నల్లమల్ల ప్రెస్ క్లబ్ (అమ్రాబాద్ ఉమ్మడి మండలం) జర్నలిస్ట్ ప్రతినిధుల బృందం గురువారం అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

పాత్రికేయులు అత్యవసర ఆరోగ్య సేవలు, పిల్లల ఉన్నత చదువులు మరియు ఇతర అధికారిక పనుల నిమిత్తం తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ప్రతినిధులు వివరించారు. కాబట్టి, ప్రస్తుతం ఇస్తున్న ఉమ్మడి జిల్లా బస్ పాసులను హైదరాబాద్ మహానగరం వరకు పొడిగించడమే కాకుండా, అక్కడ సిటీ బస్సుల్లో కూడా చెల్లేలా అవకాశం కల్పించాలని విన్నవించారు.

జర్నలిస్టుల వినతిపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తక్షణమే స్పందించారు. ఆయన వెంటనే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి ఫోన్ ద్వారా జర్నలిస్టుల సమస్యను వివరించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించడంతో జర్నలిస్ట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కి నల్లమల ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

TAGS: Achampet MLA, Vamsi Krishna, journalists bus pass issue, Ponguleti Srinivasa Reddy, Nallamala Press Club, Hyderabad bus pass, Telangana journalists, Achampet news, Amrabad journalists, TSRTC bus pass news, media representatives, Telangana latest news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com