వెల్టూర్ గ్రామంలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు

వెల్టూర్ గ్రామంలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు.
శ్రీ అలివేలు మంగా సమేత లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారికి పల్లకిలో సేవలు.
ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో రథసప్తమి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి.
మంగళవారం ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భజన పరులు స్వామి వారి సేవలు ప్రారంభించారు.
ప్రతీయేటా ఐదురోజులపాటు జరిగే రథసప్తమి పండుగ ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు వెంకటేశ్వర్లు, భాస్కర్ గార్లు తెలిపారు..
ఈసందర్భంగా గ్రామంలో ప్రధాన కూడలిలో సేవలు తీస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గోస్కే బాలరాజు, రంగారెడ్డి, భాస్కర్, జంగయ్య, వేణుగోపాల్ రెడ్డి, లింగమయ్య, మల్లయ్య, జైపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గుద్దటి బాలరాజు, జంగరావు , రాజు, జంగయ్య, నిరంజన్, మోహన్ రెడ్డి లక్ష్మారెడ్డి , బ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, వెంకటయ్య, బక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.