వెల్టూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు

జోరుగా కొనసాగుతున్న వెల్టూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు..
ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో ఈనెల 21నుండి ప్రారంభమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు సోమవారం నాటికి వైభవంగా కొనసాగుతున్నాయి.
రేణుకా ఎల్లమ్మ తల్లిని దండోరా డప్పుల మధ్యన, బైండ్ల వారి పూజరుల తో గంగా స్నానం నకు బయల్దేరుతున్నారు.
అమ్మవారిని ప్రత్యేక పూజలతో పూజించి కొలుస్తున్నారు.
ఏడు రోజులుగా కొనసాగే పండుగ సోమవారం నాటికి గంగా స్నానానికి తీసుకెళ్ళారు.
ఈనెల 25-02-2025 నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగుతుంది తెలియజేశారు.
ఇట్టి బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మేల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు నర్సయ్య , గుద్దటి బాలరాజు, దుర్గయ్య, నిరంజన్ లక్ష్మయ్య , ఉప్పరి బాలరాజు మల్లేష్, శ్రీను, తదితరులు తెలిపారు…
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin