నల్లమల ఉపాధ్యాయునికి రాష్ట్రస్థాయి అవార్డు
నల్లమల్ల ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయునికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది.హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక చేసి శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అవార్డులను ప్రదానం చేశారు.ఉపాధ్యాయ వృత్తిలో అందించిన సేవలను గుర్తించి అవార్డులకు ఎంపిక చేశారు.అచ్చంపేట కు చెందిన ఉపాధ్యాయుడు బి.పరమేశ్వర ప్రసాద్ ను ఎంపికను చేసి అవార్డు ప్రదానం చేసే జ్ఞాపికను అందజేశారు.ఈ అవార్డులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేయబడింది.ఈ కార్యక్రమంలో జలమండలి కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్,సినీ నటులు రాజశేఖర్, జీవిత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న పరమేశ్వర ప్రసాద్ ను వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.