• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

సూర్యగ్రహణంతో కరోనా తగ్గుతుందా?

Share Button

ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఆదివారం ప్రారంభమైంది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావ‌డంతో గ‌గ‌న త‌లంలో వ‌ల‌యాకార సుంద‌ర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదివారం ఉద‌యం 9.15 గంట‌లకు సూర్య‌గ్ర‌హ‌ణం మొద‌లు కాగా, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తోంది. భారత్‌లోనే మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనం ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కాగా, డిసెంబర్‌ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. Surya grahanam 2020

Surya grahanam

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై…మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగియనుంది. అయితే తెలంగాణలో మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం వుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 49 నిమిషాల వరకు 46 శాతం గ్రహణం ఉండనుంది.

సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది..Surya grahanam 2020

కాగా భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడి ప్రవేశంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు కప్పేయడం కారణంగా భూమిపై చంద్రుడి నీడ మాత్రమే కన్పిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. డెహ్రాడూన్‌, సిర్సా, టెహ్రీ ప్రాంతాల్లో వలయాకారంలో కన్పించే సూర్యగ్రహణాన్ని, ఢిల్లీ, ఛండీగఢ్, ముంబై, హైదరాబాద్‌, కోల్‌కతా, బెంగళూరు పట్టణాల్లోని ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. ఇక గ్రహణం రోజున దేశంలోని అనేక ఆలయాలను మూసివేశారు. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం, స్నానం చేయరాదని పెద్దలు చెప్తుంటారు. దేవుళ్ల విగ్రహాలను తాకరాదని, గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే స్నానం చేసి తినాలని చెప్తుంటారు. గ్రహణం అనంతరం ఆలయాలు సంప్రోక్షణ చేసి మరుసటి రోజు నుండి యధావిధిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు.

0.001 శాతం మాత్రమే వైరస్‌ అంతం..

ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు హరిస్తాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్‌ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat