ఎస్ఎల్బిసి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు.

ఎస్ఎల్బిసి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించిన రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రివర్యులు జానారెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సాగర్ ఎమ్మెల్యే జై వీర రెడ్డి తదితరులు ఉన్నారు
నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంట వద్ద ఎస్ఎల్బిసి వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.
13.9 కిలోమీటర్లలో సొరంగంలో 13.8 కిలోమీటర్లు ప్రయాణించి సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
అందులో 6.8 కిలో మీటర్లు లోకో ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పై ఏడు కిలోమీటర్ల కాలినడక
రెస్క్యూ టీంకు అండగా నిలబడి, వారికి భరోసా కల్పించిన మంత్రి
70 ఎడ్ల వయసులో మంత్రి జూపల్లి చేసిన సాహసాన్ని, కృషిని ప్రశంసిస్తున్నా నెటిజన్లు
సహాయక చర్యల్లో స్వయంగా పాలుపంచుకుని ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైన పాత్ర పోషించారని అభినందనలు
రెండు రోజులు క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి జూపల్లి
ఎప్పటికప్పుడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు సహాయక చర్యల పురోగతిని తెలుసుకుంటున్న మంత్రి