SFI ఆధ్వర్యంలో ఆందోళన

రాష్ట్రంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అచ్చంపేట డివిజన్ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఎండి సయ్యద్ ప్రధాన కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ…..మొన్న పసిపాప శ్రీహిత, నిన్న హనుమకొండలో మైనర్ బాలిక పై అఘాయిత్యం, ఇలా నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతున్నాయని,నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మృగాలలో ఎలాంటి మార్పు రావడం లేదని, ఇంకా కఠినతరమైన శిక్షలు అమలు లోకి రావాలని వారు కోరారు.
అత్యాచార నిందితులపై కాలయాపన చేయకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరగా శిక్షలు పడేలా, వాటి అమలు త్వరగా జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఆందోళనలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.