SFI అధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

◆SFI అధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం◆
ప్రైవేట్ విద్యాసంస్థలలో అధిక ఫీజులను నిరసిస్తూ SFI ఇచ్చిన పిలుపుతో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది.
అచ్చంపేట పట్టణంలోని పలు పాఠశాలలు స్వచ్చందంగా మూసివేయగా, మరికొన్ని SFI కార్యకర్తల అధ్వర్యంలో మూసివేశారు.SFI జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ అధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు విధ్య హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పుస్తకాలు,ఇతర సామాగ్రి విక్రయిస్తున్న జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
పెరిగిన ఫీజుల వల్ల పేద,మధ్యతరగతి కుటుంబాలు విద్యకు దూరం అవుతున్నారని,ప్రభుత్వం రూపొందించిన జివో 1 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ కమిటి ఏర్పాటు చేయాలని కోరారు.