RTC కార్మికుల వేతన సవరణ కోసం జూన్ 11న ఛలో బస్సుభవన్.
RTC కార్మికుల వేతన సవరణ కోసం, పనిభారం తగ్గింపుకై ఛలో బస్సు భవన్
గోడపత్రిక ఆవిష్కరణలో SWF ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్
RTCలో వేతన సవరణ ముగింపు గడువు ముగిసి 2సంవత్సరాలు పూర్తయినందున వేతన సవరణను చేపట్టాలని, రోజు రోజూకు సిబ్బంది కుదింపుతో, కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న కార్మికులపై అధిక పని భారం పడుతుందని, దీని వలన కార్మికుల ఆరోగ్యాలు దెబ్బతింటూన్నాయని పై సమస్యల పరిష్కారాల కోసం RTC స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూన్ 11న ఛలో బస్సుభవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు SWF రీజియన్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలియజేశారు. శుక్రవారం బస్సుడిపో ఆవరణలో జరిగిన ఛలో బస్సుభవన్ కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించిన ప్రభాకర్ మాట్లాడుతూ.
RTC కి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 1%నిధులు కేటాయించాలని RTC కొత్త బస్సులు కొనుగోలు చేసి,కొత్త నియామకాలు చేపట్టాలని అయన అన్నారు. ఈ గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో SWF డిపో కార్యదర్శి G.పర్వతాలు, మనోహర్, SWFరీజియన్ నాయకులు S.వెంకటయ్య, డిపో ఉపాధ్యక్షులు A.పర్వతాలు, SWF నాయకులు రంజిత్ కుమార్, B.కిష్టయ్య లతో పాటు కార్మికులు పాల్గొన్నారు.
It’s really great step.