తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత..

AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లోని లక్షల కోళ్లు మృత్యువాత.. ఆందోళనలో పౌల్ట్రీ రైతులు
తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ ఫామ్స్‌ను అంతుచిక్కని వైరస్ అల్లాడిస్తోంది. రోజూ వేలాది సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో.. పౌల్ట్రీ రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కొక్క పౌల్ట్రీ ఫారం వద్ద సుమారు రోజుకు *పదివేల కోళ్లు మృతి చెందుతున్నాయి .
కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 15 రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 40 లక్షల కోళ్లు చనిపోయాయి.
ఖమ్మం జిల్లా అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
వేలాది కోడి పిల్లలు చనిపోయాయి. వైరస్ ఒక్కొక్కటిగా.. అన్ని పౌల్ట్రీ ఫామ్స్‌కు వ్యాపిస్తుండటంతో.. తీవ్ర ఆందోళనలో ఉన్నారు పౌల్ట్రీ రైతులు. వైరస్ ఏంటో కనిపెట్టి.. దానికి సంబంధించిన వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin