LRS పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి పొంగులేటి

0
ponguleti chitrapataniki palabshekam
Share

LRS పై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి పొంగులేటి

LRS ను ( ల్యాండ్ రెగ్యులేషన్ పథకం ) ప్రకటించటం హర్షనీయం అని, ప్రభుత్వం ఋణం ఎలా తీర్చుకోవాలలో తెలియటం లేదని శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి కొనియాడారు. గురువారం నగరంలోని శ్రీ బాలాజీ స్టేట్ ఆధ్వర్యంలో ఎల్ ఆర్ ఎస్ ప్రకటించడంపై ధన్యవాదాలు తెలుపుతూ సభ నిర్వహించారు . సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అకుంఠిత దీక్షతో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుందన్నారు. అంతేకాకుండా 25% సబ్సిడీని ప్రకటించటం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు,రియల్ ఎస్టేట్ వ్యాపారులకు,ఏజెంట్ మిత్రులకు వరంగా మారిందన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం కోసం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలు రియల్, ఎస్టేట్ వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం విధానం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక రకాల ఇబ్బందులకు గురి అయ్యారని తన ఆవేదన వ్యక్తం చేశారు. దాని ఫలితంగా దాదాపు నాలుగున్నర సంవత్సరాల వ్యాపార కాలం వృధా ప్రయాసగా మారిందని వాపొయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే ఎల్ఆర్ఎస్ సమస్యను పరిష్కరించిందని తెలియజేశారు. 25 శాతం సబ్సిడీ ప్రభుత్వం ప్రకటించటం హర్షించదగ్గ అంశమని కానీ ఇలా సబ్సిడీ ప్రకటిస్తారని మీము ఊహించలేదని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. సబ్సిడీ గడువు కాలం మార్చి 31 వరకు ఇవ్వటం తమకే కలిసొచ్చే అంశం అయినప్పటికీ ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న ప్లాట్ల క్రయవిక్రయాలు ఇక ప్రారంభించాల్సి ఉంటుంది. ప్లాట్లు కొన్నవారికి రిజిస్ట్రేషన్ కు గడువు కాలం పడుతుంది కాబట్టి సబ్సిడీ సమయాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా పెండింగ్లో ఉన్న ప్లాట్ల క్రయవిక్రయాలు ఊపొందుకొని ప్రభుత్వానికి రెవెన్యూ పెరిగిద్దని ఆశించారు. ఇంతటి బృహొత్తర కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు,మంత్రివర్గ ఉప సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొనిజర్ల మాజీ ఎంపీపీ గోసు మధు ఆఫీస్ ఇంచార్జ్ పోగుల రవికుమార్ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్లు షేక్ తాజుద్దీన్,కాసాని శ్రీశైలం, గాలి నారాయణ,తోట వెంకటేశ్వర్లు, ,బాబురావు,జానీ భాష,వసీం, కళ్యాణ్ చౌదరి, సాయి కిరణ్, శ్రీకృష్ణ,ప్రశాంత్, శ్రీనివాసరావు,మల్లికార్జున్, పిఎన్ఆర్ ఏఎన్ఆర్,రవి కుమార్,కృష్ణ చౌదరి, రజినీకాంత్ చంద్రన్న గౌడ్ ఉపేందర్, సుమన్, అలవాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *