తొలిసారిగా తెలంగాణ లో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్…
తొలిసారిగా తెలంగాణ లో ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్…
మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీయాలా.. మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్ డేట్ చేయించుకోవాలా.. అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు పరుగు పరుగునా రవాణా శాఖ కార్యాలయాల(RTA)కు వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. వివిధ రకాల పౌరసేవలను పొందే సదుపాయం దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. Online Driving Licence in-Telangana
లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జ్, సాధారణ పత్రాల స్థానంలో స్మార్ట్‌కార్డులు వంటి ఐదు రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పోర్టల్‌ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. భవిష్యత్తులో మరో 12 రకాల పౌరసేవలను ఆన్‌లైన్‌లోనే పొందే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు.
Online Driving Licence in-Telangana
రవాణా శాఖ అందజేసే పౌరసేవలను మరింత సులభతరం చేసేవిధంగా ఆన్‌లైన్ సర్వీసులకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంటి వద్దనే తమకు కావలసిన సేవలను పొందేవిధంగా ఆన్ లైన్ సదుపాయంను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవలను ప్రవేశపెట్టారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin