అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచగొండి అధికారులపై దాడులు చేసినప్పుడు.. స్వాధీనం చేసుకున్న నోట్లతో పాటు టేబుల్‌పై పింక్ (గులాబీ) రంగు ద్రావణం ఉన్న బాటిళ్లు మనకు టీవీల్లో, వార్తల్లో తరచూ కనిపిస్తుంటాయి. అసలు ఈ పింక్ కలర్ నీళ్లకు, లంచానికి ఉన్న లింక్ ఏంటో చాలామందికి తెలియదు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన సైన్స్ దాగి ఉంది.
లంచం అడిగిన అధికారిని పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు ఒక పక్కా ప్లాన్ వేస్తారు. బాధితుడు అధికారికి ఇవ్వబోయే కరెన్సీ నోట్లకు ముందుగానే 'ఫినాఫ్తలిన్' (Phenolphthalein) అనే రసాయన పొడిని రాస్తారు. ఈ పౌడర్ కంటికి కనిపించదు, వాసన కూడా ఉండదు. బాధితుడి నుంచి ఆ నోట్లను సదరు అధికారి తీసుకోగానే, ఆ పౌడర్ అతడి చేతులకు అంటుకుంటుంది.
దాడి చేసిన వెంటనే ఏసీబీ అధికారులు నిందితుడి చేతులను 'సోడియం కార్బోనేట్' (లేదా సోడియం బైకార్బోనేట్) కలిపిన రసాయన ద్రావణంలో ముంచడం లేదా కడగడం చేస్తారు. ఫినాఫ్తలిన్ అనేది ఒక కెమికల్ ఇండికేటర్. ఇది క్షార గుణం (Alkaline) ఉన్న సోడియం కార్బోనేట్ నీటితో కలవగానే రంగును మార్చుకుంటుంది.
ఒకవేళ సదరు అధికారి లంచం డబ్బులను చేతులతో తాకి ఉంటే.. అతని చేతులకు ఉన్న ఫినాఫ్తలిన్ వల్ల ఆ తెల్లటి నీరు కాస్తా గులాబీ (పింక్) రంగులోకి మారుతుంది. లంచం తీసుకోకపోతే నీటి రంగు మారదు. కోర్టులో నిందితుడిపై నేరాన్ని నిరూపించడానికి ఈ పింక్ ద్రావణాన్ని ఏసీబీ అధికారులు కీలకమైన శాస్త్రీయ సాక్ష్యంగా (Scientific Evidence) సమర్పిస్తారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com