అచ్చంపేట/అమ్రాబాద్: శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైల మల్లన్నను దర్శించుకుని తిరిగి వస్తున్న శివ స్వాముల వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మరియు హైదరాబాద్‌కు చెందిన శివ స్వాములు శ్రీశైల క్షేత్రంలో ఇరుముడి సమర్పించుకుని మహేంద్ర మినీ వ్యాన్‌లో తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. వటవర్లపల్లికి రెండు కిలోమీటర్ల సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న నలుగురు శివ స్వాములకు గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
అదే సమయంలో హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ శివప్రసాద్, బీట్ ఆఫీసర్ శ్రావణి, డ్రైవర్ నిరంజన్ వెంటనే స్పందించి బాధితులను కాపాడారు. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, క్షతగాత్రులను తక్షణ చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Road Accident Near Vatawarlapally: Mini Van Hits Tree, Four Shiva Swamis Injured
Achampet/Amrabad: A severe road accident occurred on the Srisailam-Hyderabad Highway on Thursday after a Mahindra mini-van carrying devotees lost control and rammed into a tree.
The victims, identified as Shiva Swamis from Medchal and Hyderabad, were returning home after visiting the Srisailam temple. The accident took place about two kilometers away from Vatawarlapally. Among the four injured, one is reported to be in critical condition.
Forest Department officials patrolling the highway—Section Officer Shiva Prasad, Beat Officer Sravani, and Driver Niranjan—reached the spot immediately. They rescued the victims and coordinated with the 108 ambulance service to shift them to Achampet Government Hospital. The timely intervention of the forest officials helped in providing immediate medical attention to the injured.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com