వంగూరు/అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో భారీ ఎత్తున సాగుతున్న అక్రమ వండ్రు మట్టి దందా కలకలం రేపుతోంది. గత రెండు రోజులుగా తుమ్మలపల్లి పరిసర ప్రాంతాల నుండి కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని జేపీ నగర్ సమీపంలో ఉన్న ఇటుక బట్టీలకు వందలాది ట్రిప్పుల వండ్రు మట్టిని ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. వంగూరుకు చెందిన వ్యక్తి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి ఐదు భారీ టిప్పర్లు, ఒక హిటాచీ (జేసీబీ) యంత్రంతో ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆధారాలతో సహా బయటపెట్టారు.
ట్రిప్పుకు రూ. 4000 చొప్పున వసూళ్లు: ఈ అక్రమ రవాణాపై క్షేత్రస్థాయిలో ప్రశ్నించగా, స్వయంగా సదరు వ్యక్తి మాటలలోనే ఒక్కో ట్రిప్పుకు రూ. 4,000 చొప్పున చెల్లిస్తూ మట్టిని తరలిస్తున్నామని ఒప్పుకోవడం గమనార్హం. ఇంత బహిరంగంగా శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి గుండా వందలాది టిప్పర్లు పగలు, రాత్రి తిరుగుతున్నప్పటికీ అటు రెవెన్యూ విభాగం గానీ, ఇటు పోలీస్ యంత్రాంగం గానీ కనీసం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మార్వో ఆఫీసు నుంచే ఫిర్యాదుదారుడి నెంబర్ లీక్! ఈ వ్యవహారంపై బాధితులు మరియు స్థానిక విలేకరులు వంగూరు తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయానికి వెళ్లి సంప్రదించగా.. తమకు ఎలాంటి సమాచారం లేదని, తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎమ్మార్వో సమాధానం ఇచ్చారు. అయితే, ఆశ్చర్యకరంగా ఎమ్మార్వో గారితో మాట్లాడుతుండగానే, ఫిర్యాదు చేసిన వ్యక్తి మొబైల్ నెంబరును సదరు అధికారి వెంటనే మట్టి మాఫియా నిర్వాహకులకు చేరవేశారు. ఆ వెంటనే అక్రమ రవాణాదారులు ఫిర్యాదుదారునికి ఫోన్లు చేసి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ పరిణామంతో ఈ అక్రమ దందాలో ఎమ్మార్వో గారి ప్రత్యక్ష ప్రమేయం (ఇన్వాల్వ్మెంట్) ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ మొత్తం మట్టి మాఫియా వెనుక స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల హస్తం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్వో గారి కనుసైగల్లోనే ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియా చేస్తున్న వ్యక్తులపై పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణాకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com