ఉప్పరపల్లి ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం లారీల మాయం.. రైతుల ఆగ్రహం!

08, Jun 2026 Achampet 176 Views
upparapally-farmers-protest-over-rice-mill-cheating

ఉప్పరపల్లి ఐకేపీ కేంద్రంలో గందరగోళం: వరి ధాన్యం లారీల జాడ ఎక్కడ?

నాగర్‌కర్నూల్ జిల్లా, ఉప్పునుంతల మండలం (ఉప్పరపల్లి):

"ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తాం.. తడిసినా, మొలకలొచ్చినా కొంటాం.." అని ప్రభుత్వం చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి గ్రామ ఐకేపీ (IKP) కొనుగోలు కేంద్రంలో అధికారుల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రక్ షీట్ రాశారు.. కానీ లారీలు మాయం!

ఉప్పరపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేంద్రంలో కాంటా వేసిన మొదటి రెండు లారీల ధాన్యాన్ని (లారీ నంబర్: AP 02W 5143) కొండారెడ్డిపల్లిలోని విగ్నేశ్వర మిల్లుకు తరలించాలని సంబంధిత ఐకేపీ అధికారులు ట్రక్ షీట్ రాశారు. కానీ, ఆ లారీలు మిల్లుకు చేరాయా లేదా వేరే ఎక్కడికైనా వెళ్లాయా అనే 'జాడ' నేటికీ రైతులకు తెలియడం లేదు. దీనిపై రైతులు అధికారులను ప్రశ్నిస్తే, "ధాన్యం ఎక్కడికి తరలిస్తే మీకెందుకు?" అంటూ కొందరు అధికారులు, ఇతరులు బాధ్యతారహితంగా సమాధానాలు ఇస్తుండటం గమనార్హం.

మిల్లుల యజమానుల దోపిడీ.. అధికారుల కుమ్మక్కు?

గత వారం ఉప్పరపల్లి గ్రామం నుండి ఒక లారీ ధాన్యాన్ని తాడూరులోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుకు తరలించారు. అయితే అక్కడికి వెళ్లిన ధాన్యాన్ని పరిశీలించిన మిల్లు యాజమాన్యం.. "ప్యాడీ క్లీనర్‌కు ఈ ధాన్యాన్ని పట్టించలేదు కాబట్టి తరుగు (తరువు) తీస్తాం" అంటూ రైతులను ఇబ్బంది పెట్టారు. ఐకేపీ అధికారులు, రైతులు కలిసి రైస్ మిల్లు దగ్గరకు వెళ్లి నిలదీయగా.. వారు తాలు పేరుతో తరుగు తీసి, ఐకేపీ అధికారితో బలవంతంగా లెటర్ రాయించుకుని రైతులను బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రైతుల ఆవేదన: "వర్షాలు వస్తుండటంతో దళారులకు అమ్ముకోలేక, ప్రభుత్వ కేంద్రానికి ఇస్తే దళారుల కంటే ఘోరంగా రైస్ మిల్లుల వారు మమ్మల్ని నష్టపరుస్తున్నారు. మా గ్రామానికి ఏ మిల్లునైతే ట్యాగింగ్ చేశారో, అదే మిల్లుకు ధాన్యం పంపాలని మేము మొదటి నుంచి కలెక్టర్ గారికి, డీఎం గారికి లేఖలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది."

లారీల కేటాయింపు విషయంలో సివిల్ సప్లై డీటీ (Civil Supplies DT) గారికి రైతులు ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో.. అధికారులు, రైస్ మిల్లుల యాజమాన్యాలు కుమ్మక్కై తమకు ఇష్టం వచ్చిన మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్నారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఊళ్లోకి వచ్చి.. లోడ్ చేసుకోకుండానే వెళ్ళిపోయిన లారీ!

ధాన్యం సంచుల్లో నింపి వారం రోజులు అవుతున్నా లారీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ నెల 06/06/2026న గ్రామానికి ఒక లారీ (TS 05 UB 8966) వచ్చింది. కానీ ఆ లారీ డ్రైవర్ ధాన్యాన్ని ఎక్కించుకోకుండానే అదే రోజు సాయంత్రం 6 గంటలకు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు. లారీ కాంట్రాక్టర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఆ లారీని మర్రిపల్లి రోడ్డు మీద నిలిపి ఉంచగా, డ్రైవర్‌కు ఫోన్ చేసినా ఎత్తడం లేదని రైతులు చెబుతున్నారు. అసలు ఆ లారీ గ్రామానికి ఎందుకు వచ్చింది? లోడ్ చేసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏపీఎం, సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం

కేంద్రం ప్రారంభోత్సవం రోజున ఐకేపీ ఏపీఎం (APM) గారు మాట్లాడుతూ.. రవాణా, తరుగు విషయంలో రైతులకు అన్యాయం జరగనివ్వనని చెప్పారు. మొదటి లారీ పంపిన రోజు గ్రామానికి వచ్చిన ఏపీఎం గారు, ఆ తర్వాత ఇన్ని సమస్యలు వస్తున్నా అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు విమర్శిస్తున్నారు.

ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని చెప్తుంటే, ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి గ్రామంలో మాత్రం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని స్పష్టమవుతోంది. అధికారుల వైఖరి ఇలాగే కొనసాగితే రైతులందరూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించి ఉప్పరపల్లి రైతులకు న్యాయం చేయాలని, మాయమైన లారీల గుట్టు విప్పాలని కోరుతున్నారు.

TAGS: Upparapalli IKP Center, Upparapalli Paddy Purchase Center, IKP Paddy Procurement Telangana, Uppunuthala Farmers Issues, Nagarkurnool Paddy Farmers, Paddy Lorry Missing Issue, Vigneshwara Rice Mill Kondareddypalli, Sri Lakshmi Narayana Agro Industries Tadoor, Farmer Problems Telangana, Paddy Transport Issue, IKP Officials Negligence, Civil Supplies DT Nagarkurnool, Paddy Tarugu Problem, Rice Mill Fraud Allegations, Farmers Protest Upparapalli, Telangana Paddy Procurement News, Paddy Purchase Center Controversy, Uppunuthala News, Nagarkurnool News, Telangana Farmers News, Paddy Loading Lorry Issue, IKP Center Problems, Farmer Justice Demand, Rice Mill Irregularities, Paddy Procurement Scam
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com