ఉమామహేశ్వరం ఆలయంపై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: చైర్మన్ బీరం మాధవరెడ్డి

17, Jul 2026 Achampet 176 Views
Uma Maheshwaram Temple Chairman Beeram Madhava Reddy addressing the media along with board members regarding temple development.

శ్రీ ఉమామహేశ్వరం ఆలయంపై అసత్య ప్రచారాలను నమ్మొద్దు: దేవస్థానం చైర్మన్ బీరం మాధవరెడ్డి

అచ్చంపేట: శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం దేవస్థానంపై కొందరు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను దేవస్థానం చైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలక మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని వారు హితవు పలికారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  గెలిచినప్పటి నుంచి ఉమామహేశ్వరం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ  తో మాట్లాడి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కొండపై పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు అటవీ శాఖ అధికారులతో చర్చించి, కొండ దిగువన భోగ మహేశ్వరం వద్ద విశాలమైన పార్కింగ్ స్థలం, భక్తుల విశ్రాంతి కేంద్రం, బస్ స్టాండ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తుల సౌకర్యార్థం కొండపైకి మూడు బస్సులను నడుపుతున్నామని, ఇందుకు సీబీఎం ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ అనురాధ ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.

ఆలయంలో భక్తులందరికీ నిబంధనల ప్రకారం ఉచిత దర్శనం కల్పిస్తున్నప్పటికీ, కొందరు కావాలనే ఉచిత దర్శనం లేదంటూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. భోగ మహేశ్వరం, పంచలింగాలు, ఆంజనేయస్వామి ఆలయం, కోనేరు, గాలిగోపురం, 30 అడుగుల శివుడి విగ్రహం వంటి పుణ్యస్థలాల అభివృద్ధి పనులు సమిష్టి నిర్ణయాలతో వేగంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు. దేవాలయాలను రాజకీయాలకు అతీతంగా చూడాలని, అసత్య ప్రచారాలు మానుకొని ఆలయ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు పవన్, పోల శ్రీనివాసులు, మహేష్ చారి, మంత్రు నాయక్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Umamaheswaram Temple, Umamaheswaram Temple News, Achampet News, Nagarkurnool News, Srisailam North Gateway, Umamaheswaram Temple Development, Temple False News, Fake News Temple, Umamaheswaram Temple Free Darshan, Beera Madhava Reddy, Achampet MLA Vamshi Krishna, Telangana Temple News, Bhog Maheswaram, Panchalingalu, Umamaheswaram Temple Parking, Temple Development Telangana
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com