మాణిక్ బాబుకు టీజేఏసీ నివాళులు; ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీపై హర్షం

21, Jul 2026 Achampet 176 Views
Achampet T-JAC leaders paying floral tributes to Telangana movement activist Manik Babu

మలిదశ ఉద్యమకారుడు మాణిక్ బాబుకు నివాళులర్పించిన టీజేఏసీ; ఎమ్మెల్యే వంశీకృష్ణ భరోసాపై హర్షం

అచ్చంపేట:

తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పలు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఉద్యమకారుడు మాణిక్ బాబు అకాల మరణం చెందడం పట్ల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (T-JAC) అచ్చంపేట కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన భౌతికకాయానికి టీజేఏసీ నాయకులు పూలమాలలు వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఉద్యమంలో మాణిక్ బాబు చూపిన చొరవ, పోరాట పటిమ మరువలేనివని, ఆయన అకాల మరణం ఉద్యమకారులందరికీ తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. మాణిక్ బాబు కుటుంబాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్వయంగా పరామర్శించి, ప్రభుత్వం పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం పట్ల అచ్చంపేట టీజేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందనతో పాటు అచ్చంపేట జేఏసీ సైతం ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

ఈ నివాళి కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కాశన్న యాదవ్, నాయకులు బిచ్చనాయక్, నరసింహ గౌడ్, బాలాజీ, గౌరీ శంకర్, పర్వతాలు, యాదయ్య, గోపాల్, పాండు, మీడియా ఇంచార్జి మహబూబ్ అలీ, భాస్కర్, మోహన్, రామకోటి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Achampet News, Manik Babu, Telangana Movement, Telangana Activist, T-JAC Achampet, Achampet T-JAC, Dr Chikkudu Vamshi Krishna, MLA Vamshi Krishna, Telangana Statehood Movement, Tribute Meeting, Nagarkurnool News, Telangana Politics, Achampeta News, Telangana JAC, Manik Babu Tribute
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com