గిరిజన డిక్లరేషన్ అమలు చేయండి: 5 కొత్త ITDAలు, 12% రిజర్వేషన్లపై ధర్మానాయక్ డిమాండ్

27, Aug 2025 Achampet 176 Views

తెలంగాణ రాష్ట్రంలో ఐదు మైదాన ,ఏజెన్సీలలో ఐటిడిఏ ఏర్పాట్లు చేయాలి
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్


అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేవెళ్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో దళిత గిరిజనులకు డిక్లరేషన్ ప్రకటన చేయడం జరిగిందని ఆ డిక్లరేషన్ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 


అచ్చంపేట పట్టణంలోని టీఎన్జీవో భవనంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంఘం అధ్యక్షులు సభావత్ అశోక్ అధ్యక్షతన జరిగిందన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు 12 శాతానికి పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అమలు చేసి తీరుతామని ఇచ్చిన మాట ఏమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించారు. గిరిజనులకు చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి చదువు పూర్తయిన ప్రతి ఒక్కరికి ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రైవేటు కంపెనీలలో రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని అన్నారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రంలో దుకాణ ఆదివాసి ఎరుకుల సేవాలాల్ పేర్లతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంవత్సరానికి 5000 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజన తండాలు చెంచుగూడాలు ఎరుకల పెంటల అభివృద్ధి కోసం దోహద పడతామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కానటువంటి పరిస్థితి ఉందని వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదు కొత్త ఐటీడీఏలు ఏర్పాటు చేసి తొమ్మిది సూపర్ స్పెషల్ హాస్పిటల్ నిర్మాణం చేసి గిరిజనులకు అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులో ఉంచుతామని చెప్పిన మాట ముటగానే మిగిలిందని ఇప్పటివరకు ఇచ్చిన చెవెళ్ల హామీని అమలు చేసే దాంట్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని వెంటనే వాటి కోసం ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్రీకరించి గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిచో రాపోయే కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అన్ని తెగల ప్రజలను సమయ వ్యక్తం చేసే ఐక్యతతో ఉద్యమ పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. 

తెలంగాణ గిరిజన సంఘం గౌరవ అధ్యక్షులు దేశా నాయక్ మాట్లాడుతూ. గత ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేసి రాజ్యాధికారం కల్పించిన నిధులు కేటాయించకపోవడంతో తండాల అభివృద్ధి పూర్తిగా కుంటూ పడిపోయిందని ప్రతి తండాలకు 25 లక్షలు కేటాయిస్తానన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. 

గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ రాక హాస్టల్లో ఉండే పరిస్థితి లేదని ప్రభుత్వం బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు చదువుకు దోహదపడాలని కోరారు. విద్యా జ్యోతి పేరుతో పదో తరగతి చదువుకున్న గిరిజన విద్యార్థులకు 10,000 ప్రోత్సాహకాలు ఇస్తామని ఇంటర్ వారికి 25000 ఇస్తామని పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారికి లక్ష ఎంపీటి హెచ్డి చేసిన వారికి ఐదు లక్షలు ఇస్తామన్న హామీ ఇంకా అమలు కావడం లేదని వారు ప్రశ్నించారు గిరిజన చదువుకు ఆటంకం లేకుండా ఇట్లాంటి ప్రోత్సాఖాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు, లక్పతి, దశరథం, హరీష్ నాయక్ వాల్య నాయక్ రమేషు ,మల్లేష్, వెంకటేష్ శ్రీను నాయక్ నరేందర్ అనిత,

TAGS: Telangana Girijana Sangham, M Dharma Naik, Chevella Declaration, 12% Tribal Reservation, New ITDA setup, Revanth Reddy, Tribal Corporations, Achampet Meeting, Telangana Girijana Sangham, M Dharma Naik, Girijana Sangham President, Chevella Declaration, Chevella Declaration implementation, 12 percent tribal reservation, ST reservation Telangana, tribal reservation demand, ITDA Telangana, 5 new ITDAs demand, tribal welfare Telangana, ₹5000 crore tribal corporation funds, tribal development funds, Adivasi rights Telangana, tribal organizations Telangana, warning to CM Telangana, tribal protest demands, Telangana government tribal policy, scheduled tribes welfare, Telangana political news

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com