అమరావతి: ప్రవాసీ భారతీయుల సమస్యల పరిష్కారం, నూతన ఎన్నారై విధివిధానాల రూపకల్పనే ధ్యేయంగా సాగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై కమిటీ రెండు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. పర్యటనలో భాగంగా రెండవ రోజు తెలంగాణ కమిటీ ప్రతినిధులు ఏపీ పోలీస్ ఎన్నారై సెల్, సీఐడీ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రవాసీయులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఇరు రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సలహాలు, సూచనలు పంచుకున్నారు.
నకిలీ ఏజెంట్లు, డ్రగ్స్ రవాణాపై తెలంగాణ కమిటీ ప్రశ్నలు: తెలంగాణ ఎన్నారై కమిటీ ప్రతినిధులు ఈ సమావేశంలో పలు కీలక అంశాలను లేవనెత్తారు. నకిలీ ఏజెంట్లను అరికట్టడంలో ఏపీ ఎన్నారై సెల్ తీసుకుంటున్న చర్యలు, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్), విదేశాలకు మాదకద్రవ్యాల చేరవేతను నిరోధించేందుకు అమలు చేస్తున్న నివారణోపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా, కెనదా, ఖతార్, ఫిలిప్పీన్స్, దుబాయ్ వంటి దేశాలలో తెలంగాణ కమిటీ సేకరించిన పలు కేస్ స్టడీస్ (పరిశోధనాత్మక అంశాలను) ఏపీ అధికారులకు వివరించారు.
బాధితులకు అండగా కోనసీమ అమలాపురం ఎన్నారై సెల్: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అమలాపురం ప్రత్యేక ఎన్నారై సెల్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మేనేజర్ రమేష్ నేతృత్వంలోని బృందం ఈ భేటీలో ప్రదర్శించింది. ఇప్పటివరకు విదేశాల్లో వివిధ ఇబ్బందుల్లో చిక్కుకున్న 87 మంది బాధితులను సురక్షితంగా స్వదేశానికి రప్పించామని, అలాగే గల్ఫ్, ఇతర దేశాల్లో మృతి చెందిన 10 మంది భౌతికకాయాలను భారతదేశానికి తెప్పించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. నకిలీ ఏజెంట్ల పట్ల ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, అందువల్లే ఎన్నారై గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఏపీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలు తెలంగాణలో సమగ్ర ఎన్నారై పాలసీ రూపకల్పనకు ఎంతో దోహదపడతాయని తెలంగాణ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
హాజరైన ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు: ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ తరపున సీఎం ప్రవాసీ ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతిరెడ్డి, మేడిపల్లి సత్యం, ఎన్నారై కమిటీ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్ (IFS), వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావు పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, ప్రొఫెసర్లు జునుగురు శ్రీనివాస్, విజయ్ కొర్రా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరపున ఏపీ సీఐడీ డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ (IPS), ఎస్పీలు ఎన్.శ్రీదేవి రావు (WPC-1, CID), కే. చక్రవర్తి (GOW CID), ఎస్.శ్రీధర్ (EOW-1, CID), ఎస్.వి. శ్రీధర్ రావు (PCR Cell CID), ఆర్.గంగాధర్ (CID ట్రెయినింగ్), పి.పరమేశ్వర రెడ్డి (SCRB CID), కే. ఈశ్వర్ రావు (EOW-2 CID) తదితరులు పాల్గొని తమ అనుభవాలను, కార్యాచరణను పంచుకున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com