మే 31న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూప ఆవిష్కరణ - TUJAC పిలుపు

11, May 2026 Achampet 176 Views
TUJAC leaders releasing the Telangana Martyrs Memorial poster in Mannanur

మే 31న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూప ఆవిష్కరణ: విజయవంతం చేయాలని TUJAC పిలుపు

మన్ననూరు (అమరాబాద్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మృత్యర్థం డిండి చింతపల్లి గ్రామంలో నిర్మించిన అమరవీరుల స్మారక స్థూప ఆవిష్కరణ సభను మే 31న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను మన్ననూరు గ్రామంలోని గద్దర్ విగ్రహం వద్ద TUJAC (తెలంగాణ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ) నాయకులు సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా TUJAC రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమకారులకు నేటికీ తగిన గుర్తింపు, గౌరవం దక్కకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ ఆవిష్కరణ సభలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంపల్లి సాయిలు, ప్రధాన కార్యదర్శి కళ్లేపు చంద్రన్న ప్రసాద్, యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు కలుముల నాసరయ్య, టీవీవీయూ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఉద్యమకారులు జక్కగోపాల్, నాగేష్, చెవ్వ పాండు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Telangana Amaraveerula Smaraka Stupam, Telangana Martyrs Memorial, TUJAC, TUJAC Telangana, Dindi Chintapalli, Amrabad News, Mannanur News, Telangana Movement, Telangana Martyrs, Memorial Inauguration May 31, Gaddar Statue Mannanur, Telangana United Joint Action Committee, Telangana Activists, Amaraveerula Stupam, Nagar Kurnool News, Telangana Latest News, Memorial Event Telangana, Telangana Statehood Movement, Protest Leaders Telangana
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com