చెంచు పెంటలలో సోలార్ వెలుగులు: స్వేచ్ఛ ఫౌండేషన్ సేవా కార్యక్రమం

28, Dec 2025 Amrabad 176 Views

నల్లమల చెంచు పెంటలలో వెలుగులు.. 'స్వేచ్ఛ ఫౌండేషన్' ఆధ్వర్యంలో సోలార్ లైట్ల పంపిణీ

అచ్చంపేట: విద్యుత్ సౌకర్యం లేని నల్లమల అటవీ ప్రాంతంలోని నిరుపేద చెంచు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు 'స్వేచ్ఛ ఫౌండేషన్' కీలక ముందడుగు వేసింది. మాతృభూమి సంస్థ కోరిక మేరకు, అటవీ ప్రాంతంలోని బౌరాపూర్, అప్పాపూర్, పుల్లాయి పల్లి చెంచు పెంటలలో నివసిస్తున్న కుటుంబాలకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోలార్ లైట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా స్వేచ్ఛ ఫౌండేషన్ నిర్వాహకురాలు శ్రీదేవి మాట్లాడుతూ.. విద్యుత్ సౌకర్యం లేని ప్రతి చెంచు కుటుంబానికి సోలార్ లైట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అణగారిన వర్గాల అభివృద్ధికి తమ ఫౌండేషన్ నిరంతరం తోడ్పాటునందిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జయ భారతి, యూకే (UK) నుండి వచ్చిన రమణారెడ్డి, నాగమణి, చింతల భాస్కర్, గురువులు, నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అచ్చంపేటలోని మాతృభూమి కార్యాలయంలో విదేశాల నుండి వచ్చి ఇక్కడి నిరుపేదలకు సేవ చేస్తున్న శ్రీదేవి, రమణారెడ్డి, నాగమణి బృందానికి మాతృభూమి నిర్వాహకులు మంజుల, రమాకాంత్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వారు కోరారు.

TAGS: Svecha Foundation Sridevi, Solar lights for Chenchu, Nallamala forest news, Achampet Mathrubhumi, Tribal welfare Telangana, Nagarkurnool News, Svecha Foundation, solar lights distribution, Chenchu tribes, Nallamala forest, Achampet news, Chenchu penta development, tribal welfare Telangana, solar energy for tribals, rural electrification alternatives, Svecha Foundation social service, Mathrubhumi Organization, Bourapur Chenchu penta, Appapur Chenchu settlement, Pullayi Palli Chenchu penta, NGO activities in Telangana, forest tribal welfare, Nallamala tribal villages, renewable energy social work

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com